Amit Shah Says Congress Is ‘ Anti-Ambedkar ‘ | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెల్సిందే.
అమిత్ షా అంబేడ్కర్ ను అవమానించారని, మనుస్మృతిని విశ్వసించే వారికి అంబేడ్కర్ ఆలోచనలు నచ్చవని విపక్షాలు విమర్శకు గుప్పిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ కు వ్యతిరేకమని, తన వ్యాఖ్యల్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంబేడ్కర్ కు వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని, తన ప్రసంగం రాజ్యసభ రికార్డుల్లో ఉందన్నారు.
బీజేపీ అంబేడ్కర్ ను ఎంతో గౌరవించిందని, కానీ కాంగ్రెస్ మాత్రం రిజర్వేషన్ల, రాజ్యాంగ వ్యతిరేక పార్టీ అని దుమ్మెత్తిపోశారు. తాను అంబేడ్కర్ ను అవమానించని పార్టీ, సిద్ధాంతాల నుండి వచ్చినట్లు చెప్పారు.
మల్లికార్జున్ ఖర్గే తన రాజీనామాతో సంతోష పడుతారంటే అలానే చేస్తా, కానీ కాంగ్రెస్ మరో 15 ఏళ్ళు ప్రతిపక్షంలోనే ఉంటుంది, దీన్ని ఎవరూ మార్చలేరని అమిత్ షా వ్యాఖ్యానించారు.