Allu Arjun Visits Chiranjeevi House | సంధ్య థియేటర్ ( Sandhya Theatre ) తొక్కిసలాట కేసులో శుక్రవారం అరెస్ట్ అయిన అల్లు అర్జున్ శనివారం ఉదయం మధ్యంతర బెయిల్ పై విడుదల అయిన విషయం తెల్సిందే.
ఈ క్రమంలో ఆదివారం అల్లు అర్జున్ ( Allu Arjun ) మామ మెగాస్టార్ చిరంజీవి ( Megastra Chiranjeevi ) ఇంటికి వెళ్లారు. స్వయంగా కారు నడుపుకుంటూ చిరు ఇంటికి వెళ్లిన అర్జున్, తొక్కిసలాట ఘటనను ఆయనకు వివరించారు. అనంతరం అల్లు అర్జున్ అరెస్ట్ గురించి మెగాస్టార్ ఆరా తీశారు.
అల్లు అర్జున్ వెంట తండ్రి అరవింద్, తల్లి మరియు భార్యా పిల్లలు కూడా మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. ఇదిలా ఉండగా శుక్రవారం అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలుసుకున్న చిరంజీవి ‘ విశ్వంభర ‘ సినిమా షూటింగ్ ను ఆపేసి హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. కుటుంబానికి ధైర్యం చెప్పిన విషయం తెల్సిందే.