Allu Arjun Arrest | తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్ ( Allu Arjun )ను పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ పోలీసుల సహాయంతో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను శుక్రవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ లోని నివాసానికి వచ్చిన పోలీసులు అల్లు అర్జున్ ను పోలీసు వాహనంలో చిక్కడపల్లి పీఎస్ కు తరలిస్తున్నారు. డిసెంబరు 4న పుష్ప-2 బెనిఫిట్ షోలను ప్రదర్శించారు.
ఈ క్రమంలో ఆర్టీసీ ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ వెళ్లారు. అయితే ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది.
ఆమె కుమారుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులోనే అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.