MLA Resigns To BRS | తెలంగాణ ఎన్నికల ముందు అధికార బీఆరెస్ పార్టీ (BRS Party)కి మరో బిగ్ షాక్ తగిలింది.
నోటిఫికెషన్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటికే పలువురు నేతలు బీఆర్‌ఎస్‌ను వీడగా.. తాజాగా మరో ముఖ్యనేత గులాబీ పార్టీకి వీడ్కోలు చెప్పేశారు.
అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం (Abraham) బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరనున్నారు.
ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ (Sampath Kumar) ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమక్షంలో అబ్రహం హస్తం పార్టీలో చేరనున్నారు.
జూబ్లీహిల్స్ లోని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నివాసంలో అబ్రహం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.
అయితే ఇప్పటికే అలంపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్‌కు చెందిన నలుగురు జెడ్పీటీసీలు, ముగ్గురు ఎంపీపీలు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు కాంగ్రెస్‌లో చేరారు.