Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > బాలయ్య ఫ్యాన్స్ కు నిరాశ.. అఖండ 2 రిలీజ్ పై కీలక ప్రకటన!

బాలయ్య ఫ్యాన్స్ కు నిరాశ.. అఖండ 2 రిలీజ్ పై కీలక ప్రకటన!

akhanda 2

Akhanda 2 Release Date | నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ లో తెరకెక్కుతున్నచిత్రం అఖండ2 (Akhanda 2). అఖండ సినిమాకు కొనసాగింపుగా ఈ చిత్రం నిర్మితమవుతోంది.

ఈ సినిమాలో ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. అఖండ ఘన విజయం సాధించడంతో పార్ట్ 2 పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాతో బాలయ్య మరోసారి బాక్సాఫీస్ దగ్గర శివతాండవం చేయడం ఖాయమని నందమూరి ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాను సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ తొలుత ప్రకటించారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్, రీ-రికార్డింగ్ తదితర పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో తాము ముందుగా ప్రకటించిన సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయలేకపోతున్నామని.. ఈ సినిమా అందరికీ నచ్చే విధంగా త్వరలోనే మరో కొత్త డేట్‌తో రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.

దీంతో ‘అఖండ 2’ వాయిదాను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది.  

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions