Wednesday 23rd April 2025
12:07:03 PM
Home > సినిమా > ‘లివ్ అండ్ లెట్ లివ్.. ఫ్యాన్ కామెంట్ కి సమంత ఘాటు రిప్లై!

‘లివ్ అండ్ లెట్ లివ్.. ఫ్యాన్ కామెంట్ కి సమంత ఘాటు రిప్లై!

samantha

Samantha | ప్రముఖ నటి సమంత తాజాగా నటించిన సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ (Citadel: Honey Bunny). ఈ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సిటాడెల్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు సమంత.

అందులో భాగంగా దీపావళి పండుగను రాజస్థాన్ లో జరుపుకొన్నారు. రణతంబోర్ జాతీయ పార్కులో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈమేరకు సోమవారం సమంత ఇన్ స్టాలో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ నిర్వహించారు.

ఈ క్రమంలో ఓ అభిమాని సమంతను బరువు పెరగాలని సూచించారు. ప్లీజ్ మేడం. బరువు పెరగండి అని కామెంట్ చేశాడు. దీనిపై సమంత అసంతృప్తి వ్యక్తం చేశారు. తన బరువు గురించి మరో కామెంట్ అంటూ నిట్టూర్చారు.

‘నేను మయోసైటిస్ తో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలుసో లేదో. కానీ వైద్యుల సలహా ప్రకారం నేను డైట్ మెయింటైన్ చేస్తున్నా. దీనివల్ల బరువు పెరగడం కుదరదు. బరువు విషయంలో జాగ్రత్త వహించాల్సిన పరిస్థితిలో ఉన్నా.

దయచేసి ఇతరులలో తప్పొప్పులు చూడడం ఇప్పటికైనా మానేయండి. మనం 2024లో ఉన్నామనే విషయం గుర్తించండి. లివ్ అండ్ లెట్ లివ్..’ అంటూ సమంత కాస్త ఘాటుగా స్పందించారు.

You may also like
Jahnvi kapoor
మగాళ్లకు పీరియడ్స్ వస్తే.. జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ntr neel movie
NTRNeel సినిమా నుంచి కీలక అప్ డేట్!  
allu arjun gets interim bail
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్.. క్రేజీ వీడియో రిలీజ్!
Ram Charan
రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions