A fox invaded the field of play at Lord’s | క్రికెట్ కు పుట్టినిల్లు అయిన లండన్ లోని లార్డ్స్ మైదానంలో ఓ నక్క హల్చల్ చేసింది. మైదానం చుట్టూ పరుగులు పెడుతూ కాసేపు ఆటకు అంతరాయం కలిగించింది.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ది హండ్రెడ్ టోర్నీలో భాగంగా లండన్ స్పిరిట్, ఓవల్ ఇన్విన్సిబుల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన లండన్ జట్టు 80 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది.
అనంతరం ఓవల్ జట్టు లక్ష్య చేదనకు దిగింది. ఓవల్ బ్యాట్సమెన్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ నక్క మైదానంలోకి ప్రవేశించింది. ఎటు నుంచి ఇది వచ్చిందో తెలీదు కానీ గ్రౌండ్ లో పరుగులు పెడుతూ కాసేపు గందరగోళం సృష్టించింది.
అయితే ఆ నక్క ఓ ఒక్కరినీ గాయపరచలేదు. కాసేపటి తర్వాత అది మైదానం నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఈ మ్యాచ్ లో ఓవల్ జట్టు విజయం సాధించింది.









