YS Jagan News Latest | ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు వైసీపీ అభిమానులు తాజగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రిపై ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 21న వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారన్న కారణంతో ఏకంగా 11 మంది వైఎస్సార్‌సీపీ అభిమానులపై క్రిమినల్ కేసులు పెట్టి, అందులో 8 మందిని 13 రోజుల పాటు రిమాండ్‌కు పంపారని జగన్ కు వివరించారు. తమపై ఖమ్మంకు చెందిన ఓ మంత్రి, ఆయన తనయుడి ప్రమేయంతోనే పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టి నాన్‌బెయిలబుల్ సెక్షన్‌లతో జైలుకు పంపారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో జగన్ స్పందిస్తూ తెలంగాణలో వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు, క్యాడర్ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పార్టీ క్యాడర్‌కు అవసరమైన న్యాయసహాయాన్ని అందించేందుకు పార్టీ లీగల్ సెల్ అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు.









