Ravi Teja’s 77th Film Titled Irumudi | మాస్ మహారాజ రవితేజ కొత్త సినిమాకు సంబంధించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. రవితేజ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ‘ఇరుముడి’ మూవీ టైటిల్, అలాగే హీరో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపిస్తున్నారు. ఇది రవితేజ 77వ సినిమా. ఇరుముడి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన మేకర్స్ రవితేజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో రవితేజ అయ్యప్పస్వామి మాల ధరించి ఇరుముడితో కనిపించారు. దింతో భక్తి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
ఇందులో హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా, జీవి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. మళ్లీ అలాంటి ఒక కథలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. నమ్మకంతో ముందుకు సాగుతూ ఇరుముడి అనే ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. స్వామియే శరణం అయ్యప్ప’ అని రవితేజ పేర్కొన్నారు.









