Vijay Sethupathi’s film with Puri Jagannadh titled ‘Slum Dog’ | ‘మురికివాడల నుంచి పుట్టే భయంకరమైన తుఫాన్ ను ఎవరూ ఆపలేరు’ అనే క్యాప్షన్ తో విడుదలైన పూరీ-సేతుపతి సినిమా ఫస్ట్ లుక్ వైరల్ గా మారింది. దర్శకుడు పూరి జగన్నాథ్ నటుడు విజయ్ సేతుపతి కాంబోలో గతేడాది జులై ఓ సినిమా పట్టాలెక్కిన విషయం తెల్సిందే. కేవలం ఐదు నెలల్లోనే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. తాజగా సినిమా టైటిల్ ను, విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘స్లమ్ డాగ్-33 టెంపుల్ రోడ్’ అనే టైటిల్ ను ఈ సినిమాకు ఖరారు చేశారు. ఇందులో విజయ్ సేతుపతి లుక్ అందర్నీ ఆకట్టుకుంది. చుట్టూ నోట్ల కట్టల మధ్యలో చేతిలో రక్తంతో ఉన్న కత్తిని పట్టుకుని ఉన్న సేతుపతి లుక్ ఆసక్తిగా ఉంది. అతి త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది.








