Ambati Rambabu Bhogi Dance | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు బుధవారం మొదలయ్యాయి. ఇందులో భాగంగా గుంటూరు పట్టణంలో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా భోగి వేడుకలు జరిగాయి. ఇందులో వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు ఎప్పటిలాగే పాటలకు స్టెప్పులేస్తూ అలరించారు. కూటమి ప్రభుత్వాన్ని వ్యగ్యంగా విమర్శిస్తూ రూపొందించిన ఓ పాటకు అంబటి లయబద్దంగా స్టెప్పులేశారు.
ఇందులో ‘కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల జీవితాల్లో అంధకారం వచ్చింది, కూటమి ప్రభుత్వాన్ని కూల్చేది, మళ్లీ వచ్చేది జగనన్నే చెబుతున్నాడు రాంబాబు, వింటున్నావా చంద్రబాబు’ అని సాగే పాటకు అంబటి డాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అలాగే భోగి మంటల్లో ప్రభుత్వ జీవోలను దహనం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను గుంటూరు నుండి పోటీ చేయనున్నట్లు అంబటి కీలక ప్రకటన చేశారు.









