Drunk Man Creates Ruckus at Ramagundam | సార్ నేను ఊదను, ఊదలేను అంటూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు సమయంలో పోలీసులకు చుక్కలు చూపెట్టాడు ఓ వ్యక్తి. దింతో మందుబాబును పోలీసులు బ్రతిమిలాడాల్సి వచ్చింది. ఈ ఘటన రామగుండంలో చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు జోరుగా ముగిశాయి. యువతతో పోటీ పడి మరీ పెద్దలు న్యూ ఇయర్ వేడుకల్లో భాగం అయ్యారు. మందుబాబులను అరికట్టేందుకు పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు.
ప్రతీ న్యూ ఇయర్ లాగానే ఈ సారి కూడా కొందరు మందుబాబులు తమ వింత ప్రవర్తనతో వార్తల్లోకి ఎక్కారు. ఇలా రామగుండంకు చెందిన ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో భాగంగా బైక్ పై వెళ్తున్న ఓ 58 ఏళ్ల వ్యక్తిని పోలీసులు ఆపారు. బ్రీత్ అనలైజర్ నోటి దగ్గర పెట్టగానే నేను ఊదను సర్ అంటూ సదరు వ్యక్తి ఖరాఖండిగా చెప్పేశాడు. దింతో పోలీసులు అతన్ని బ్రతిమిలాడాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ఊది ఊదనట్టు చేశాడు. ఇలా కొద్దిసేపు పోలీసులను సతాయించాడు. ఆఖరికి బ్రీత్ అనలైజర్ టెస్టులో 89 పాయింట్ల రీడింగ్ వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.









