Matthew Hayden Finally Reacts After Joe Root Saves Him From Naked Run | ఇంగ్లాండ్ ఆటగాడు సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ మాథ్యూ హేడెన్ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు మాథ్యూ హేడెన్ నగ్నంగా నడిచే పని ఇకలేదని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. యాషెస్ సిరీస్ లో భాగంగా బ్రిస్బేన్ లోని ది గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య గురువారం రెండవ టెస్టు మొదలైంది. తొలి రోజు ఆటలో భాగంగా జో రూట్ సెంచరీ నమోదు చేశారు. ఆస్ట్రేలియా గడ్డపై రూట్ కు ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. కాగా జో రూట్ సెంచరీతో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్ సంబరాలు చేసుకున్నారు. కారణం యాషెస్ సిరీస్ కంటే ముందు ఆయన విసిరిన సవాలే.
ఈ సిరీస్ కంటే ముందు వరకు ఆస్ట్రేలియా గడ్డపై రూట్ కు ఒక్క సెంచరీ లేదు. అయినప్పటికీ యాషెస్ సిరీస్ లో భాగంగా రూట్ కచ్చితంగా సెంచరీ నమోదు చేస్తారని, అలా జరగకపోతే తాను మెల్బోర్న్ స్టేడియంలో నగ్నంగా నడుస్తా అంటూ హేడెన్ సవాల్ చేశారు. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. అయితే తాజాగా రూట్ సెంచరీ చేయడంతో హేడెన్ తన సవాల్ ను గెలిచారు.









