Friday 30th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఏఐతో ఈ-కామర్స్ సంస్థకు షాక్ ఇచ్చిన కస్టమర్!

ఏఐతో ఈ-కామర్స్ సంస్థకు షాక్ ఇచ్చిన కస్టమర్!

cracked eggs with ai

Customer Creates Cracked Eggs with AI | ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని శాసించే దిశగా పయనిస్తోంది. ఏఐతో ప్రయోజనాలతోపాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే డీప్ ఫేక్ ఫోటోలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు కొత్త రకం మోసాలు కూడా తెరపైకి వస్తున్నాయి.

తాజాగా ఇన్‌స్టామార్ట్‌ లో ఓ వినియోగదారుడు ఏఐ సాయంతో ఒక ఫేక్ ఫొటో క్రియేట్ చేసి, కంపెనీ నుంచి పూర్తి రిఫండ్ పొందాడు. ఈ ఘటన ఈ-కామర్స్ కంపెనీల రిఫండ్ వ్యవస్థలలోని లోపాలను ఎత్తి చూపుతోంది. ఓ వ్యక్తి ఇన్‌స్టామార్ట్‌ లో కోడిగుడ్లు ఆర్డర్ చేశాడు. వాటిలో ఒకటి పగిలి ఉంది.

దీనిపై ఫిర్యాదు చేసే సమయంలో గూగుల్‌కు చెందిన ‘నానో బనానా ప్రో’ అనే ఇమేజింగ్ టూల్‌ను ఉపయోగించి, ఆ ఫొటోలో  apply more cracks అని ప్రాంప్ట్ ఇచ్చాడు. దీంతో ఆ ఎగ్ ట్రేలో ఫొటోను 20కి పైగా గుడ్లు పగిలిపోయినట్లుగా మార్చేసింది.

ఈ ఫొటోను చూసిన ఇన్‌స్టామార్ట్ సపోర్ట్ టీమ్ అది నిజమని నమ్మి వెంటనే అతడికి పూర్తి రిఫండ్ చేసింది. ఈ ఘటనను ఎక్స్ లో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలాంటి మోసాలు కేవలం ఒక శాతం మంది చేసినా, క్విక్-కామర్స్ కంపెనీల వ్యాపారాలు కుప్పకూలిపోతాయని అభిప్రాయపడుతున్నారు.

You may also like
newly married couple photoshoot in tirumala
‘తెలియక చేశాం.. క్షమించండి’.. ఫొటోషూట్ వివాదంపై కొత్త జంట!
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు
కేసీఆర్ కు నోటీసులు..’సూర్యుడిపై ఉమ్మివేయడమే’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions