superstar Krishna’s statue removed from Visakhapatnam Jagadamba Center | వైజాగ్ లోని జగదాంబ సెంటర్ లో ఇటీవలే ఏర్పాటు చేసిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. విగ్రహం ఏర్పాటు చేయడానికంటే ముందు అక్కడ జనసేన జెండా, వెనుకాల ఉన్న గోడపై జనసేన సిద్ధాంతాలు ఉండేవని కానీ వాటిని తొలగించి కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని జనసేన పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు.
నిజమైన కృష్ణ అభిమానులు ఇలా ఎప్పుడు చేయారన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జనసేన జెండాను తొలగించాలని ప్రయత్నించారన్నారు. కానీ అది సాధ్యం కాలేదని తెలిపారు. ఈ మధ్య మొంథా తుఫాన్ ముందస్తు జాగ్రత్తలు తర్వాత సహాయ కార్యక్రమాలలో ప్రజలు, జనసేన నాయకులు, అధికారులు నిమగ్నమై ఉన్న సమయంలో.. జనసేన పార్టీ జెండాను తీసేసి, జెండా దిమ్మను తీసేసి వెనుక గోడపై సిద్ధాంతాలపై సున్నం వేసి, అదే ప్రదేశంలో అనుమతి లేకుండా సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆయన వెల్లడించారు.
సుప్రీం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా, చట్టవిరుద్ధంగా అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు నేరం అని అన్నారు. ఈ అంశంపై అధికారులు వెంటనే స్పందించి జనసేజ్ జెండాను పునరుద్ధరించాలని కోరారు. ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు తాజగా కృష్ణ విగ్రహం తొలగించారు









