KTR Alleges ‘Vote Chori’ By Congress In Jubilee Hills | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సంచలన ఆరోపణలు చేశారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2023 అసెంబ్లీ ఎన్నికల నుండి 2025 నాటికి 23 వేల ఓట్లు పెరిగినట్లు ఎన్నికల కమిషన్ తెలియజేసిందని రెండేళ్లు కూడా తిరగకుండా 23 వేల ఓట్లు ఎలా పెరిగాయనే అనుమానం అనుమానంతో దర్యాప్తు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
సెప్టెంబర్ 2న ఒకే రోజు 12 వేలకు పైగా దొంగ ఓట్లను నమోదు చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్ యాదవ్‌కు మూడు ఓట్లు ఉన్నాయని, కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికి మూడు ఓట్లు ఉన్నాక ఎన్నికలు స్వేచ్ఛగా ఎలా జరుగుతాయి అని ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన వ్యక్తి ఎన్నికల కమిషన్ డ్యూటీని తన చేతుల్లోకి తీసుకొని అక్రమంగా ఓటు ఐడీలను పంచారని మండిపడ్డారు.
మైనర్ బాలబాలికలకు కూడా ఓటర్ ఐడీలను కాంగ్రెస్ అభ్యర్థి పంచారని కీలక ఆరోపణలు చేశారు. అలాగే బూత్ నంబర్ 125లో ఒక ఇంట్లో 23 ఓట్లు ఉన్నాయని 80 గజాలు మాత్రం ఉన్న ఇంట్లో ఎంతోమంది ఎందుకు వచ్చారో మాకు తెలవదని యజమాని చెప్పినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్‌కు సంబంధించిన ఇంట్లో 32 దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. 42 ఓట్లు ఉన్నాయని ఓటర్ లిస్టులో పేర్కొన్న ఇంటి నంబర్‌తోని వెతికితే అసలు ఆ ఇల్లే లేదన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు కేటీఆర్.









