TVK Vijay | తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఇటీవల టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దురదృష్టకర సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ విజయ్ తొలిసారి వీడియో ప్రకటన విడుదల చేశారు.
“నా జీవితంలో ఇలాంటి విచారకరమైన ఘటనను నేను ఎదుర్కోలేదు. నా హృదయం బాధతో నిండి ఉంది. ప్రజలు నాకు చూపిన ప్రేమకు నేను ఎప్పుడూ కృతజ్ఞుడిని. కానీ, కరూర్‌లో జరిగిన ఘటన విషాదంగా మారింది. ప్రజల భద్రతను పరిగణలోకి తీసుకొని, నా ర్యాలీని సురక్షితంగా నిర్వహించడానికి నేను సిధ్ధాంతాలతో రాజీ పడకుండా, పోలీసు అధికారులను కోరుకున్నాను. కానీ, జరగకూడనిది జరిగింది,” అని విజయ్ అన్నారు.
ఈ ఘటనపై రాజకీయం చేస్తున్నారని అభిప్రాయపడిన ఆయన తాము ఎలాంటి నిర్లక్ష్యాన్ని చూపించలేదు. కానీ, ఇప్పుడు మా పార్టీపై ఎఫ్ఐఆర్లు నమోదు అవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు, మీరు ప్రతీకారం తీర్చుకోవాలంటే, నన్ను తాకండి. నా నాయకులపై దాడులు చేయవద్దు,” అని విజయ్ స్పష్టం చేశారు. ఆయన ఇంకొకసారి కరూర్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ,
“మా ప్రయాణం మరింత బలంగా, ధైర్యంగా కొనసాగుతుంది. ఈ సమయంలో నా పార్టీ సభ్యులకు, నాయకులకు, మరియు నా పట్ల మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని విజయ్ తెలిపారు. ప్రభావిత కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తూ, “ప్రతి ఒక్కరూ త్వరలో కోలుకుంటారు,” అని ఆయన చెప్పారు.









