Saturday 31st January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ట్రెండింగ్ లో కశిశ్ మెత్వానీ.. ఆమె ప్రత్యేకత ఏంటో తెలుసా!

ట్రెండింగ్ లో కశిశ్ మెత్వానీ.. ఆమె ప్రత్యేకత ఏంటో తెలుసా!

kashish methwani

Kashish Methwani | సోషల్ మీడియాలో సోమవారం కశిశ్ మెత్వానీ (Kashish Methwani) అనే యువతి పేరు ట్రెండింగ్ లో ఉంది. నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఎవరామే.. నెటిజన్లు ఎందుకు ప్రశంసిస్తున్నారు?

కారణమేంటంటే.. అందాల పోటీల నుంచి ఆర్మీకి వెళ్లి దేశ సేవ చేస్తున్నారు కశిశ్ మెత్వానీ. మహారాష్ట్రలోని పూణే నగరానికి చెందిన 24 కశిశ్ మెత్వానీ 2023లో మిస్ ఇంటర్నేషనల్ ఇండియాగా నిలిచారు. చదువులోనూ ముందుండే ఆమె అమెరికాలోని  హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ సీటును దక్కించుకున్నారు.

అయితే మోడలింగ్ రంగంలో అవకాశాలను.. ఇటు హార్వర్డ్ ఆఫర్‌ను తిరస్కరించిన కశిశ్ భారత సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా 2024 కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.

ఏడాది పాటు కఠినమైన శిక్షణ తర్వాత ఇప్పుడు లెఫ్టినెంట్ హోదాను పొందారు. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఫ్యాషన్ రంగం నుంచి దేశానికే సేవ చేయాలనే సంకల్పంతో అద్భుత అవకాశాలను సైతం వదులుకొని భారత సైన్యంలో చేరిన కశిశ్ మెత్వానీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

You may also like
police as mother
ఖాకీ దుస్తుల కాఠిన్యం వెనక కరిగిన అమ్మ మనసు.. వీడియో వైరల్!
massive avalanche in jammu kashmir
జమ్మూకశ్మీర్ లో భారీ హిమపాతం.. వీడియో వైరల్!
flying fish
ఎగిరే చేప వీడియో వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్!
nara deer
వారెవా.. జింక క్రమశిక్షణకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions