Melania Trump sends letter to Putin about abducted children | రష్యా అధ్యక్షుడు పుతిన్ కు లేఖ రాశారు అమెరికా ఆధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలనే లక్ష్యంతో ఆగస్ట్ 15న ట్రంప్-పుతిన్ భేటీ అయ్యారు. అమెరికాలోని అలాస్కాలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా మెలానియా రాసిన లేఖను పుతిన్ కు అందజేశారు ట్రంప్. లేఖలో మెలానియా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బాధపడుతున్న పిల్లల దుస్థితిని ప్రస్తావించారు.
ఆమె యుద్ధం గురించి నేరుగా చర్చించకుండా, పిల్లల అమాయకత్వాన్ని కాపాడాలని, వారి నవ్వులను తిరిగి తీసుకురావాలని పుతిన్‌ను విజ్ఞప్తి చేశారు. పిల్లల అమాయకత్వాన్ని కాపాడటం ద్వారా, రష్యాకు మాత్రమే కాకుండా మానవాళికి సేవ చేసినవారవుతారని పుతిన్ ను మెలానియా కోరారు.
ఇదిలా ఉండగా ట్రంప్-పుతిన్ సమావేశం రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి మార్గాలను కనుగొనడం లక్ష్యంగా జరిగినప్పటికీ, ఎలాంటి ఒప్పందం కుదరలేదు. కానీ చర్చలు సానుకూలంగా సాగాయని ట్రంప్ మరియు పుతిన్ ప్రకటించారు.









