Rajinikanth Hails Pawan Kalyan as a Political Thoofan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సూపర్ స్టార్ రజినీకాంత్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. పొలిటికల్ తుఫాన్ పవన్ కళ్యాణ్ అని ఆయన అభినందించారు.
ఇటీవలే రజినీకాంత్ సినీ జీవితంలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. రజినీ సినీ గోల్డెన్ జూబ్లీ నేపథ్యంలో పవన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
తాజగా దీనిపై రజినీకాంత్ స్పందించారు. ‘నా సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం, రాజకీయ పెను తుఫాన్ పవన్ కళ్యాణ్ ప్రేమతో చెప్పిన శుభాకాంక్షలు నన్ను ఉప్పొంగేలా చేశాయి. దీనిని ఓ గౌరవంగా భావిస్తున్నా’ అని రజినీ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రజినీకాంత్ పోస్ట్ కు పవన్ రిప్లై ఇచ్చారు. రజినీకాంత్ ను బిగ్ బ్రదర్ అని సంభోదించారు. ‘మీ ఆప్యాయమైన మాటలకు మరియు ఆశీస్సులకు నేను నిజంగా కృతజ్ఞుడను. మీ వ్యాఖ్యలు నా హృదయాన్ని తాకాయి. మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని అలాగే ఆరోగ్యంతో ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షితున్నాను’ అని పవన్ బదులిచ్చారు.









