Mrunal Thakur Post | గత కొన్ని రోజులుగా ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thkuar) పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కొన్నేళ్ల కిందట ఆమె ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను నటి బిపాసా బసు (Bipasa Basu) కంటే చాలా అందంగా ఉంటానని చెప్పారు.
బిపాసా కండలు తిరిగిన పురుషుడిలా కనిపిస్తారని అన్నారు. ఆమెతో పోలిస్తే తాను ఎన్నో రెట్లు అందగత్తెనని కామెంట్ చేశారు. ఇది ఇటీవల వైరల్ అవుతోంది. దీంతో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు మృణాల్ మాటలను తప్పుపట్టారు.
బిపాసా కూడా పరోక్షంగా ఆమెకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన కామెంట్స్ పై మృణాల్ స్పందించారు. 19 ఏళ్ల వయసులో తెలివి తక్కువగా మాట్లాడానని తెలిపారు. అందంపై సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇంతమందిని బాధిస్తాయని తనకు అప్పుడు అర్థం కాలేదన్నారు. అలా మాట్లాడినందుకు తీవ్రంగా చింతిస్తున్నానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
తను ఎవరినీ అవమానించాలని అలా మాట్లాడలేదన్నారు. తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని ఇప్పుడు అనుకుంటున్నాన్ననారు. ఏళ్లు గడిచేకొద్దీ అందానికి అసలైన నిర్వచనం నాకు అర్థమైంది. అది ఎంతో విలువైనది. మనసుతో చూస్తే ప్రతి దానిలోనూ సౌందర్యం ఉంటుందని మృణాల్ తన ఇన్స్టాలో రాసుకొచ్చారు.









