CM Revanth Reddy News | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ‘బీసీ ధర్నా’ చేపట్టిన విషయం తెల్సిందే.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గైర్హాజరు అవ్వడానికి గల కారణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. మాజీ కేంద్రమంత్రి శిబూ సోరెన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాహుల్ ఝార్ఖండ్ వెళ్లినట్లు సీఎం తెలిపారు.
అలాగే కోర్టు కేసు ఉండడంతో రాంచీలోనే రాహుల్ ఉండిపోయారని అందుకే ‘బీసీ ధర్నా’ కు హాజరుకాలేదని వివరించారు. దీనిపై ప్రతిపక్షాలు చేసే ఆరోపణల్ని పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కానీ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధాని నరేంద్ర మోదీ అని తెలిపారు.









