Saturday 31st January 2026
12:07:03 PM
Home > తాజా > డోనాల్డ్ ట్రంప్ బీహార్ వాసి

డోనాల్డ్ ట్రంప్ బీహార్ వాసి

Donald Trump from Samastipur: fake application rejected in Bihar | బీహార్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరిట నివాస ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేయడం సంచలనంగా మారింది.

బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా, మొహియుద్దీన్‌నగర్ బ్లాక్‌లో జూలై 29 ఒక ఆన్‌లైన్ దరఖాస్తు అధికారుల దృష్టికి వచ్చింది. డోనాల్డ్ ట్రంప్ పేరిట ఓ ఆకతాయి నివాస ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశాడు.

ఇందులో ట్రంప్ ఫోటోను కూడా జతచేశాడు. అయితే, ఈ దరఖాస్తును పరిశీలించిన మొహియుద్దీన్‌నగర్ సర్కిల్ ఆఫీసర్ (సీవో) దీనిని నకిలీదిగా గుర్తించారు. ప్రభుత్వ వ్యవస్థను అపహాస్యం చేసేందుకు కొందరు ఆకతాయిలు ఈ చర్యకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు.

దీంతో దరఖాస్తును తక్షణమే తిరస్కరించారు. అంతేకాకుండా స్థానిక సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఐటీ చట్టం కింద దరఖాస్తు దారుడి మీద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని సీవో స్పష్టం చేశారు. కాగా ఇటీవలే బీహార్ అధికారులు శునకం పేరిట ఓ నివాస ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేయడం సంచలనంగా మారింది.

You may also like
కోఠిలో కాల్పులు..ఇదీ జరిగింది!
చర్యలు తీసుకోండి..పవన్ కు బిడ్డను కోల్పోయిన మహిళ వినతి
ఈ సైకిల్ పై బాబు రయ్ రయ్!
ఎన్నికల బరిలో గల్వాన్ వీరుడు సంతోష్ బాబు తల్లి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions