TTD Srivani Tickets | తిరుమల వేంకటేశుని దర్శనార్థం ఇచ్చే శ్రీవాణి టిక్కెట్లపై (Srivani Tickets) తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి టిక్కెట్ల కోటాను పెంచింది.
ప్రస్తుతం ఉన్న 1500 టిక్కెట్ల కోటాను 2వేల టికెట్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి రోజు కరెంట్ బుకింగ్ కోటా కింద తిరుమలలో 2వేల టిక్కెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 400 టిక్కెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
శ్రీవాణి టికెట్ల జారీ సమయంలో కూడా మార్పులు చేసింది టీటీడీ. ఇకపై టికెట్ పొందిన రోజు సాయంత్రమే భక్తులు వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లేలా టీటీడీ మార్పులు చేసింది. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 15 వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. నవంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనుంది.








