Ravi Shastri Reveals Insane Amount Indian Cricketers Earn | టీం ఇండియా దిగ్గజ ఆటగాళ్లు అయిన సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ ఏటా రూ.100 కోట్లపైనే సంపాదిస్తారని వెల్లడించారు భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి.
ఈ మేరకు ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్లు మైఖెల్ వోగన్, అలిస్టర్ కుక్ లతో కలిసి ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్ లో క్రికెట్ ఓ మతం లాంటిదని ఈ సందర్భంగా శాస్త్రి పేర్కొన్నారు. సచిన్, ధోని, కోహ్లీ 15-20 యాడ్స్ లో కనిపిస్తారని దింతో ఏటా ఈ ఆటగాళ్లు రూ.100 కోట్లపైనే సంపాదిస్తారని పేర్కొన్నారు.
దింతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే సునిల్ గావస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీలు తన టాప్-5 భారత క్రికెటర్లని చెప్పారు.
టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ అధిగమించే అవకాశం ఉందన్నారు.









