Nimisha Priya’s execution in Yemen is postponed | కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ కేసుకు సంబంధించి యెమెన్ దేశం జులై 16న ఉరిశిక్ష ఖరారు చేసిన విషయం తెల్సిందే.
తాజగా ఈ శిక్షను ఆ దేశ అధికారులు వాయిదా వేశారు. నిమిష ప్రియ కేసుకు సంబంధించి విదేశాంగ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. యెమెన్ దేశ షరియా చట్టాల ప్రకారం బాధిత కుటుంబం ‘బ్లడ్ మనీ’ ని స్వీకరించి క్షమాభిక్ష ప్రసాధిస్తే నిమిష ప్రియ మరణశిక్ష నుండి తప్పించుకునే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుతానికి బాధిత కుటుంబం బ్లడ్ మనీకి అంగీకరించలేదని కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ లోని నిమిష ప్రియ కుటుంబానికి మరియు బాధిత కుటుంబానికి మధ్య చర్చల కోసం మరింత సమయం కోరేందుకు విదేశాంగ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఇందులో భాగంగా యెమెన్ దేశ జైలు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపింది. ఈ నేపథ్యంలో నిమిష ప్రియకు బుధవారం మరణశిక్ష అమలు కావాల్సి ఉండగా, దీనిని ఆ దేశ జైలు అధికారులు తాజగా వాయిదా వేశారు.









