TG Panchayat Elections | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర హైకోర్టు (Telangana High Court) కీలక తీర్పు వెలువరించింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు మాజీ సర్పంచ్లు దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి.
ఈ నేపథ్యంలోనే జస్టిస్ టి. మాధవి దేవి బుధవారం స్థానిక సంస్థల ఎన్నికలపై తుది తీర్పును వెలువరించారు. సెప్టెంబర్ 30లోపు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలని గడువు విధించారు. 30 రోజుల్లో వార్డుల విభజన పూర్తి చేయాలని ఆదేశించారు.
విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది స్థానిక ఎన్నికల నిర్వహణకు 30 రోజలు గడువు కోరారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం 60 రోజుల సమయం కోరింది. పూర్తి వాదనలు విన్న జస్టిస్ టి.మాధవి దేవి సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికల నిర్వహణను పూర్తి చేయాలని ఆదేశించారు.









