Israel-iran News | ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. ఇదే సమయంలో ఇజ్రాయిల్ కు మద్దతుగా అమెరికా కూడా రంగంలోకి దిగింది.
ఇరాన్ లోని అణుకేంద్రాలపై అమెరికా ఇటీవలే దాడులతో విరుచుకుపడడం ఈ ఉద్రిక్తతలను మరింత పెంచింది. అంతేకాకుండా ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.
పరిణామాలు వేగంగా మారుతున్నా టెహ్రాన్ కు సుధీర్ఘకాలంగా మిత్ర దేశమైన రష్యా, ఇరాన్ కు సహాయం చేయడానికి ముందుకు రాకపోవడం ఆసక్తిగా మారింది. కేవలం మాటల ద్వారా మద్దతు తెలపడం వరకే రష్యా పరిమితం అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధంలో ఎందుకు పాల్గొనడం లేదో వివరించారు. ‘ఒకప్పటి సోవియెట్ యూనియన్, ప్రస్తుత రష్యాకు చెందిన సుమారు 20 లక్షల మంది ఇజ్రాయిల్ లో నివాసం ఉంటున్నారు. ఇప్పుడు ఇజ్రాయిల్ కూడా రష్యన్ బాష మాట్లాడే దేశమే.
అందుకే ఈ యుద్ధంలో రష్యా తటస్థంగా ఉంది’ అని పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కు సహాయం చేయకపోవడం పై వస్తున్న విమర్శలను ఈ సందర్భంగా పుతిన్ కొట్టిపారేశారు.
ఇదే సమయంలో రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మధ్వదేవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కు అణ్వాయుధాలు అందించడానికి చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.









