SVSN Varma News Latest | పిఠాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు ఎస్.వి.ఎస్.ఎన్ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా పోలీసుల తీరుపై వర్మ అసహనం వ్యక్తం చేశారు. తొలుత వర్మతో కలిసి డిప్యూటీ సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసే కార్యక్రమంలో పవన్ పక్కనే వర్మ ఉన్నారు.
అయితే అనంతరం బీసీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ లో కుట్టు మెషీన్లు, వ్యవసాయ పనిముట్లు పంపిణీ కార్యక్రమంలో జరిగింది. కానీ పోలీసులు తన అనుచరులని అనుమతించకపోవడం పై వర్మ సీరియస్ అయ్యారు. కాసేపటికి పరిస్థితి సద్దుమనిగింది.
ఈ నేపథ్యంలో వర్మ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ‘ రాష్ట్రంలో ఇంకా వైసిపి అధికారంలోనే ఉందన్న భ్రమలో ఓ జిల్లా పోలీస్ అధికారి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జెండా అంటే అంత చిన్న చూపా. అయినా క్రమశిక్షణతో భరిస్తున్నాం’ అంటూ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు.









