Saturday 31st January 2026
12:07:03 PM
Home > తాజా > మగాళ్లకు పీరియడ్స్ వస్తే.. జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

మగాళ్లకు పీరియడ్స్ వస్తే.. జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Jahnvi kapoor

Jahnvi Kapoor Comments on Periods | మహిళలు ప్రతినెల ఎదుర్కొనే పీరియడ్స్, మూడ్ స్వింగ్స్ గురించి ప్రస్తావిస్తూ సినీ నటి జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పీరియడ్ సమయంలో తనకు కూడా మూడ్ స్వింగ్స్ వస్తాయని చెప్పారు.

తన మాట తీరును బట్టే తాను పీరియడ్స్ లో ఉన్నానని ఎదుటి వారికి తెలిసిపోతుందనీ, అందుకే తాను చిరాకుగా మాట్లాడగానే ‘నీకు  పీరియడ్స్ టైమా’ అని అడుగుతారని తెలిపారు. అయితే ఆ ప్రశ్న అడిగే విధానమే ఒక్కోసారి బాధను కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

నెలసరి నొప్పిని కొందరు చాలా చిన్న విషయంగా పేర్కొంటూ హేళనగా మాట్లాడతారనీ, అయితే అర్థం చేసుకున్నవాళ్లు మాత్రం ప్రశాంతత కలిగేలా ప్రవర్తించి, విశ్రాంతి తీసుకోమని సలహాలిస్తారని తెలిపారు.

 “పీరియడ్ పెయిన్ అనుభవించేవారికి మాత్రమే తెలుస్తుంది. ఆ సమయంలో మేం పడే బాధను, ఈ మానసిక స్థితిని అబ్బాయిలు ఒక్క నిమిషం కూడా భరించలేరని కచ్చితంగా చెప్పగలను. ఒకవేళ మగవాళ్లకు పీరియడ్స్ వస్తే ఆ నొప్పికి అణుయుద్ధాలే జరిగేవేమో..!” అని చెప్పారు.

You may also like
varanasi
కాశీలో హెర్డింగ్ లపై వీడిన సస్పెన్స్.. వారణాసి సినిమా రిలీజ్ డేట్ ఇదే!
chiranjeevi
పద్మ అవార్డు గ్రహీతలకు ‘చిరు’ సన్మానం..!
mrunal dhanush wedding ai photo
మృణాల్ – ధనుష్ పెళ్లి ఫోటో వైరల్.. అసలు నిజం ఇదీ!
‘స్పిరిట్’ లో విలన్ గా ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ ?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions