Saturday 17th May 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘పవన్ రాకతో ట్రాఫిక్..పరీక్షా కేంద్రానికి విద్యార్థులు ఆలస్యం’

‘పవన్ రాకతో ట్రాఫిక్..పరీక్షా కేంద్రానికి విద్యార్థులు ఆలస్యం’

JEE Mains Exam Students Stuck In Traffic Due to Pawan Kalyan Convoy | డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా 30 మంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారని నిప్పులుచేరిగింది వైసీపీ.

విశాఖ జిల్లా పెందుర్తి లో సోమవారం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వస్తుండడంతో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారని, దింతో పెందుర్తి అయాన్ డిజిటల్ విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వెళ్లారని పేర్కొంది.

జేఈఈ పరీక్ష సోమవారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ఉండగా, పవన్ కళ్యాణ్ కాన్వాయ్ మూలంగా 30 మంది విద్యార్థులు ట్రాఫిక్ లో చిక్కుకుని రెండు నిమిషాలు కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్నారని జగన్ పార్టీ వెల్లడించింది.

ఆలస్యం కారణంగా విద్యార్థులను సిబ్బంది లోపలికి అనుమతించలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో కష్టపడి చదివి పరీక్షలు రాయకపోతే ఆ విద్యార్థులు ఎంత బాధ పడుతారో తెలుసా పవన్ అంటూ జగన్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

You may also like
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’
పురుషులపై ఆసక్తి లేదు..పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions