Nagababu News Latest | ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ నేపథ్యంలో బుధవారం శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో చిరంజీవి సోదరుడు నాగబాబుకు అభినందనలు తెలియజేశారు. అలాగే నాగబాబును గతంలో సన్మానించిన ఫోటోలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా, చిరంజీవి సతీమణి సురేఖ నాగబాబును పెన్నును బహుకరించారు. చిరంజీవి పోస్టుపై నాగబాబు సంతోషం వ్యక్తం చేశారు.
‘ అన్నయ్యా.. మీ ప్రేమకు, మద్దతుకు కృతజ్ఞతలు. మీరు, వదిన కలిసి బహుమతిగా ఇచ్చిన పెన్ను నాకెంతో ప్రత్యేకం. ఆ పెన్నుతోనే ప్రమాణ స్వీకారం సమయంలో సంతకం చేయడం గౌరవంగా భావిస్తున్నా’ అని నాగబాబు పోస్ట్ చేశారు.