Saturday 31st January 2026
12:07:03 PM
Home > తాజా > ‘డీలిమిటేషన్ పై రెండవ సదస్సు..వేదిక హైదరాబాద్’

‘డీలిమిటేషన్ పై రెండవ సదస్సు..వేదిక హైదరాబాద్’

Next meeting on delimitation will be held in Hyderabad | లోకసభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో చెన్నై వేదికగా ‘ఫెయిర్ డీలిమిటేషన్’ పై జాయింట్ యాక్షన్ కమిటీ తొలి సమావేశం జరిగింది.

ఇందులో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు విభేదాలను పక్కనపెట్టి తమ వాటా దక్కించుకునేందుకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం సీఎం పిలుపునిచ్చారు.

పున‌ర్విభ‌జ‌న‌తో నష్ట‌పోనున్న రాష్ట్రాల ప్ర‌జ‌ల అభిమ‌తానికి అనుగుణంగా రెండో స‌ద‌స్సును హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తామ‌ని, అనంత‌రం భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేస్తామ‌ని రేవంత్ తెలిపారు. ఇందుకు స‌ద‌స్సులో పాల్గొన్న‌వారంతా మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో పున‌ర్విభ‌జ‌న సద‌స్సు స‌భ‌కు హైద‌రాబాద్ వేదిక‌గా మార‌నుంది.

పున‌ర్విభ‌జ‌న‌పై ద‌క్షిణాదితో పాటు న‌ష్ట‌పోయే ఇత‌ర రాష్ట్రాల గ‌ళాన్ని బ‌లంగా వినిపించేందుకు ఆయా రాష్ట్రాల్లోని అన్ని పార్టీల ఎంపీల‌తో ఒక క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

You may also like
కోఠిలో కాల్పులు..ఇదీ జరిగింది!
చర్యలు తీసుకోండి..పవన్ కు బిడ్డను కోల్పోయిన మహిళ వినతి
ఈ సైకిల్ పై బాబు రయ్ రయ్!
ఎన్నికల బరిలో గల్వాన్ వీరుడు సంతోష్ బాబు తల్లి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions