Saturday 31st January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బాబు, పవన్ సాయం’

‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బాబు, పవన్ సాయం’

YSRCP About Vizag Steel Plant Privatization | ఏపీలోని కూటమి సర్కార్ పై సంచలన ఆరోపణలు చేసింది వైసీపీ. చాపకింద నీరులా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహాయం చేస్తున్నారని జగన్ పార్టీ ఆరోపించింది.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై క్లారిటీ కోసం పబ్లిక్ గ్రీవెన్స్‌కు మాజీ ఉద్యోగి పాడి త్రినాథ్ లేఖ రాశారని, ఆ లేఖపై స్పందిస్తూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో మార్పు లేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చినట్లు వైసీపీ సదరు లెటర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ప్రైవేటీకరణని అడ్డుకున్నట్లు కబుర్లు చెబుతూ కార్మికులతో పాటు ప్రజలనూ కూటమి ప్రభుత్వం మోసం చేస్తున్నదని పేర్కొంది. ఇంకెంతకాలం ఇలా మోసపూరిత మాటలతో జనాన్ని మభ్యపెడతావు చంద్రబాబూ? అంటూ జగన్ పార్టీ ప్రశ్నించింది.

You may also like
‘లేడికి-లేడి గెటప్ కు తేడా తెలీదా’..జగన్ కు కమెడియన్ కౌంటర్
పాడి కౌశిక్ పై ఎంఐఎం, ఐపీఎస్ సంఘం తీవ్ర ఆగ్రహం
ఖమ్మం మంత్రిపై వైఎస్ జగన్ కు ఫిర్యాదు
social media code for govt servants
వారు సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తప్పనిసరి.. ఎక్కడంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions