Saturday 31st January 2026
12:07:03 PM
Home > క్రీడలు > కోహ్లీని ఔట్ చేయాలని చూశాం..విరాట్ పై పాక్ కెప్టెన్ ప్రశంసలు

కోహ్లీని ఔట్ చేయాలని చూశాం..విరాట్ పై పాక్ కెప్టెన్ ప్రశంసలు

Pak Captain Mohammad Rizwan praises Virat Kohli | పాకిస్తాన్ పై రన్ మెషీన్ విరాట్ కోహ్లీ చెలరేగిపోయిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ ( Pakistan Captain ) విరాట్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ( ICC Champions Trophy )లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా టీం ఇండియా పాకిస్తాన్ తో తలపడింది. పాక్ పై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ సెంచరీతో ఆదరగొట్టి, టీం ఇండియాకు సెమీస్ బెర్తు దాదాపు ఖరారు చేశారు.

కాగా మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ( Mohammad Rizwan ) కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీని ఔట్ చేయడానికి పాక్ బౌలర్లు ఎంతగానో ప్రయత్నించారని కానీ అతడు అద్భుతమైన షాట్లు కొడుతూ మ్యాచ్ ను భారత్ వైపు తీసుకెళ్లాడని పేర్కొన్నారు.

ఈ మ్యాచ్ కోసం కోహ్లీ చాలా కష్టపడి ఉంటారని, ఆయన హార్డ్ వర్క్ ( Hard Work ) చూసి తాను చాలా ఆశ్చర్య పోయినట్లు పాక్ కెప్టెన్ చెప్పారు. కోహ్లీ ఫార్మ్ లో లేదని అందరూ అన్నారు, కానీ పెద్ద మ్యాచ్ లో సెంచరీ చేశాడని ప్రశంసించారు. కోహ్లీ ఫిట్నెస్ ( Fitness ) ను కచ్చితంగా మెచ్చుకోవాలని రిజ్వాన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

You may also like
ఎన్నికల బరిలో గల్వాన్ వీరుడు సంతోష్ బాబు తల్లి
కేసీఆర్ ఇంటి గోడకు సిట్ నోటీసులు..కేటీఆర్ కన్నెర్ర
బంగారం, వెండి ధరలు పతనానికి కారణం ఈయనే!
రష్యన్ అమ్మాయిలతో సెక్స్..బిల్ గేట్స్ కు రోగం?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions