Tuesday 15th September 2026
12:07:03 PM
Home > తాజా > ఆమే నా బలం.. చిరంజీవి ఆసక్తికర పోస్ట్!

ఆమే నా బలం.. చిరంజీవి ఆసక్తికర పోస్ట్!

Chiranjeevi

Chiranjeevi Tweet | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‌(Chiranjeevi)- సురేఖ (Surekha) దంపతులు గురువారం వారి 45 వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్నారు.

1980 ఫిబ్రవరి 20న హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో చిరంజీవి వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో పెళ్లిరోజు సందర్భంగా చిరంజీవి ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు.

దుబాయ్ కి వెళ్ళే దారిలో కొంతమంది ప్రియమైన స్నేహితులతో విమానంలో మా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము! అని నాగార్జున అమల దంపతులతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు.

‘సురేఖ లాంటి జీవిత భాగస్వామి రావడం నా అదృష్టం. ఆమే నా బలం, నా బలగం. నా లక్ష్యాన్ని నా కలల్ని సాధించడానికి నాకు మార్గదర్శినిగా నిలిచింది. ఆమె సాహచర్యం ఎల్లప్పుడూ నాకు ఓదార్పును, ప్రేరణను ఇస్తుంది.

సురేఖ అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పాలనుకుంటున్నా. థాంక్యూ మై సోల్ మెంట్ సురేఖ. ఇలాంటి పెళ్లిరోజులు మనం మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా. మాకు శుభాకాంక్షలు చెప్పిన నా ఆత్మీయులు, స్నేహితులు, అభిమానులందరికీ ధన్యవాదాలు” అని పోస్ట్ చేశారు చిరంజీవి.

https://twitter.com/KChiruTweets/status/1892509680054022156

You may also like
గణేశ్ చతుర్థి వేళ చిరంజీవి కీలక పిలుపు!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions