Saturday 31st January 2026
12:07:03 PM
Home > క్రీడలు > ఐపీఎల్ లో 10 బిగ్గెస్ట్ మ్యాచులు ఇవే

ఐపీఎల్ లో 10 బిగ్గెస్ట్ మ్యాచులు ఇవే

IPL 2025 Biggest Matches | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 18వ ఎడిషన్ కు సంబంధించి పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదలైన విషయం తెల్సిందే. మార్చి 22 నుండి మే 25 వరకు ఐపీఎల్ అలరించనుంది.

మొత్తం 65 రోజులకు గాను 74 మ్యాచులు జరగనున్నాయి. అయితే తాజగా 10 బిగ్గెస్ట్ మ్యాచుల లిస్టును స్టార్ స్పోర్ట్స్ ( Star Sports ) విడుదల చేసింది. ఇందులో ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచు కోల్కత్త నైట్ రైడర్స్ ( KKR ) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( RCB ) తలపడనున్నాయి.

ఓపెనింగ్ మ్యాచు మొదటి బిగ్గెస్ట్ మ్యాచు ( Biggest Match )గా నిలవనున్నట్లు స్టార్ స్పోర్ట్స్ అభిప్రాయం పడింది.

అనంతరం బిగ్గెస్ట్ రైవలరీ ( Biggest Rivalry ) కింద చెన్నై సూపర్ కింగ్స్ వర్సస్ ముంబయి ఇండియన్స్ ( CSK vs MI )మ్యాచు, సదర్న్ రైవలరీ ( Sothern Rivalry ) కింద చెన్నై వర్సస్ బెంగళూరు మ్యాచ్, బ్యాటిల్ ఆఫ్ నైబర్స్ ( Battle Of Neighbours ) గా గుజరాత్ వర్సస్ ముంబై, బ్యాటిల్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్టర్స్ ( Battle Of Biggest Hitters ) గా కోల్కత్త వర్సస్ సన్ రైజర్స్ హైదరాబాద్, రోహిత్ శర్మ విరాట్ కోహ్లీల రో వర్సెస్ కో ( RO vs KO ) బెంగళూరు వర్సస్ ముంబయి, బ్లాక్ బస్టర్ బ్యాటిల్ ముంబయి వర్సస్ హైదరాబాద్, సదర్న్ రైవలరీ 2 ( Sothern Rivalry )చెన్నై వర్సస్ హైదరాబాద్, సదర్న్ రైవలరీ రిపీట్స్ కింద చెన్నై వర్సస్ బెంగళూరు మ్యాచు మరియు ఫైనల్స్ ( Finals ) మ్యాచ్ ఇలా ఈ 10 మ్యాచులు ఐపీఎల్ లోనే బిగ్గెస్ట్ మ్యాచులుగా నిలుస్తాయని స్టార్ స్పోర్ట్స్ స్పష్టం చేసింది.

You may also like
ఎన్నికల బరిలో గల్వాన్ వీరుడు సంతోష్ బాబు తల్లి
కేసీఆర్ ఇంటి గోడకు సిట్ నోటీసులు..కేటీఆర్ కన్నెర్ర
బంగారం, వెండి ధరలు పతనానికి కారణం ఈయనే!
రష్యన్ అమ్మాయిలతో సెక్స్..బిల్ గేట్స్ కు రోగం?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions