Sunday 6th July 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మహా కుంభమేళా..అమిత్ షా యోగి మధ్య ఆసక్తికర సన్నివేశం

మహా కుంభమేళా..అమిత్ షా యోగి మధ్య ఆసక్తికర సన్నివేశం

Amit Shah Participates In Mahakumbh | ప్రయాగ్రాజ్ ( Prayagraj ) లో జరుగుతున్న మహా కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. అలాగే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించేందుకు రాజకీయ ప్రముఖులు సైతం తరలివస్తున్నారు.

సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Amit Shah ) కుంభమేళాలో పాల్గొన్నారు. కుటుంబంతో కలిసి గంగ, యమున, సరస్వతి నదీ సంగమం వద్ద పుణ్యస్నానం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి గంగనదికి హారతి ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అమిత్ షా తనయుడు, ఐసీసీ ఛైర్మన్ జై షా ( Jai sha ) కూడా ఉన్నారు. కాగా అమిత్ షా కుంభమేళా పర్యటన సందర్భంగా ఆయనతో పాటు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( Yogi Adityanath ), యోగా గురు బాబా రాందేవ్ కూడా త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించారు.

ఈ సమయంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. కేంద్రమంత్రి అమిత్ షా త్రివేణి సంగమంలో స్నానమచరిస్తుండగా పక్కనే ఉన్న సీఎం యోగి ఆయనపై నీళ్లు చల్లారు. ఈ క్రమంలో అక్కడ నవ్వులు విరబూశాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది

You may also like
సిగాచీ ప్రమాదం..జన్మదిన వేడుకలకు జగ్గారెడ్డి దూరం
‘హిందీ రుద్దలేరు..20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ఠాక్రే సోదరులు’
‘ఫిష్ వెంకట్ కు ప్రభాస్ సహాయం..అందులో నిజం లేదు’
ఇద్దరు కుమారులతో పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions