Wednesday 22nd January 2025
12:07:03 PM
Home > తాజా > థమన్ వ్యాఖ్యలు హృదయాన్ని తాకాయి..చిరంజీవి పోస్ట్

థమన్ వ్యాఖ్యలు హృదయాన్ని తాకాయి..చిరంజీవి పోస్ట్

Chiranjeevi Reaction On Thaman Comments | సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ ( SS Thaman ) వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) స్పందించారు. ఆయన వ్యాఖ్యలు హృదయాన్ని తాకాయని పేర్కొన్నారు.

డాకు మహారాజ్ ( Daku Maharaj ) సక్సెస్ ఈవెంట్ సందర్భంగా థమన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిన విషయం తెల్సిందే. ఆన్లైన్ లో కొందరు చేసే నెగిటివిటీ సినిమాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని ఆవేదన చెందారు. మనమే మన సినిమాను చంపేస్తున్నాం అంటూ థమన్ భావోద్వేగానికి గురయ్యారు.

ఈ క్రమంలో చిరంజీవి స్పందించారు. ‘ Dear థమన్ నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా  అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, Words can inspire. And Words can destroy. Choose what you wish to do. మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుంది.’ అని చిరు సూచించారు.

You may also like
డిప్యూటీ సీఎంపై టీడీపీ నేతల వ్యాఖ్యలు..జనసేన కీలక సూచన
చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రియాంక చోప్రా..న్యూ జర్నీ పై పోస్ట్
హిల్ చర్చ్ – కేబీకే హాస్పిటల్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు!
‘చెరువుల్ని నాశనం చేసే ఎయిర్పోర్ట్ వద్దు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions