Thursday 18th September 2025
12:07:03 PM
Home > క్రీడలు > పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ..భారత జట్టు ఇదే !

పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ..భారత జట్టు ఇదే !

ICC Champions Trophy 2025 India Squad Announcement | ఎనమిది దేశాలు తలపడే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ ( BCCI ) భారత టీంను ప్రకటించింది.

ఫిబ్రవరి 19 నుండి పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెల్సిందే. అయితే టీం ఇండియా మాత్రం తన మ్యాచులను దుబాయ్ వేదికగా ఆడనుంది. ఈ క్రమంలో శనివారం వాంఖేడే స్టేడియంలో సుమారు రెండున్నర గంటల పాటు సమావేశం జరిగింది.

అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ), చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ( Ajit Agarkar ) మీడియా సమావేశం నిర్వహించి 15 మందితో కూడిన టీంను ప్రకటించారు. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మకు తోడుగా శుభమన్ గిల్ కు వైస్ కెప్టెన్ బాధ్యతల్ని అప్పగించారు.

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కులదీప్ యాదవ్, బుమ్రా, షమీ, అర్షదీప్ సింగ్ లతో కూడిన టీంను బీసీసీఐ ప్రకటించింది.

ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఇంగ్లాండ్ ( England ) తో జరగబోయే సిరీస్ ను కూడా ఇదే టీం ఆడనున్నట్లు స్పష్టం చేశారు. చివరిసారిగా 2013లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకున్న విషయం తెల్సిందే.

You may also like
విమోచన దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన పవన్
‘అనుముల కాదు ముడుపుల రేవంత్ రెడ్డి’
నూతన రాజకీయ పార్టీని స్థాపించిన తీన్మార్ మల్లన్న
మోదీ బర్త్ డే..మూడు నెలల తర్వాత ట్రంప్ తో మాట

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions