Sunday 18th May 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > హెల్మెట్ లేకపోతే నో పెట్రోల్.. బంక్ సిబ్బందికి షాక్ ఇచ్చిన లైన్ మన్!

హెల్మెట్ లేకపోతే నో పెట్రోల్.. బంక్ సిబ్బందికి షాక్ ఇచ్చిన లైన్ మన్!

power cut

Power Cut To Petrol Pump | రోడ్డు ప్రమాదాల్లో మరణాలను నివారించడానికి యూపీ ప్రభుత్వం (UP Government) హెల్మెట్ ధరించని బైకర్లకు పెట్రోల్ పొయ్యొద్దని (No Helmet No Fuel) నిబంధన విధించింది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హోర్డింగ్లను ఏర్పాటు చేస్తోంది.

ఈ నేపథ్యంలో హాపూర్ జిల్లాలో విద్యుత్ లైన్ మన్ పెట్రోల్ కోసం బంకు వచ్చాడు. అయితే హెల్మెట్ లేకపోవడంతో బంకు సిబ్బంది పెట్రోల్ పోయడానికి నిరాకరించారు. దాంతో అతడు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.

ఆగ్రహంతో ఊగిపోతూ ఫ్యూయల్ పంపునకు పవర్ సప్లై అయ్యే స్తంభంపైకి ఎక్కి.. విద్యుత్ సరఫరాను ఆపేసి వెళ్లిపోయాడు. దీంతో షాక్ అయిన బంక్ సిబ్బంది విద్యుత్ అధికారులను ఆశ్రయించడంతో దాదాపు 20 నిమిషాల తర్వాత వారు కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు.

అనంతరం బంక్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైన్ మెన్ విద్యుత్ స్తంభం ఎక్కి సరఫరాను నిలిపివేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో అవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.  

You may also like
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’
పురుషులపై ఆసక్తి లేదు..పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions