Restrictions in Cyberabad | నూతన సంవత్సర వేడుకల (New Year Celebreations) నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ (Cyberabad Commissionerate) పరిధిలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఐటీ కారిడార్లో అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై భారీ వాహనాలు, విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) తనిఖీలు చేపడతారని తెలిపారు. మద్యం సేవించిన వారికి పబ్లు, బార్ల యాజమానులు ప్రైవేటు వాహనాలు, డ్రైవర్లను అందుబాటులో ఉంచాలని పోలీసులు సూచించారు.









