Champions Trophy 2025 Schedule | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ ( Champions Trophy 2025 Schedule ) విడుదల అయ్యింది.
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ పాకిస్తాన్ ( IND vs PAK ) మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్ ( Dubai )వేదికగా జరగనుంది. బీసీసీఐ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ కు పాకిస్తాన్ అంగీకరించిన విషయం తెల్సిందే.
ఈ క్రమంలో భారత్ మ్యాచులు తటస్థ వేదిక అయిన దుబాయ్ లో జరగనున్నాయి. గ్రూప్-ఏ ( Group-A ) లో భారత్, పాకిస్తాన్, న్యూజీలాండ్, బంగ్లాదేశ్ గ్రూప్-బి ( Group-B )లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి.
ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా పాకిస్తాన్ మరియు న్యూజీలాండ్ మ్యాచ్ తో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఫిబ్రవరి 20న భారత్ బంగ్లాదేశ్ తో మరియు మార్చి 2న న్యూజిలాండ్ తో తలపడనుంది.
అలాగే ఫైనల్ మార్చి తొమ్మిదిన జరగనుంది. భారత్ ఫైనల్ కు వెళ్తే దుబాయ్ లో లేదంటే మ్యాచ్ లాహోర్ లో జరగనుంది.