Wednesday 25th December 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > 410 మందిని తొలగిస్తాం..ఆర్జీవి డబ్బులు తిరిగివ్వాలి

410 మందిని తొలగిస్తాం..ఆర్జీవి డబ్బులు తిరిగివ్వాలి

AP Fiber Net Chairman GV Reddy | ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఫైబర్ నెట్ ప్రక్షళనలో భాగంగా వైసీపీ ( YCP ) హయాంలో నియమించిన 410 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు మంగళవారం మీడియాతో మాట్లాడారు. గత పాలనలో అర్హత లేని వారికి ఫైబర్ నెట్ లో ఉద్యోగాలు ఇచ్చారన్నారు. వైసీపీ నేతలు ఆదేశాలతో ఉద్యోగుల్ని నియమించినట్లు పేర్కొన్నారు.

అయితే గతంలో కొందరు ఉద్యోగులు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇంట్లో పనిచేశారని, జీతాల పేరుతో ఫైబర్ నెట్ నుండి రూ.కోట్లు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. కక్షతో ఉద్యోగులను తొలగించడం లేదని, లీగల్ నోటీసులు పంపి వివరణ కోరుతామన్నారు.

అలాగే దర్శకుడు రాం గోపాల్ వర్మ ( Ram Gopal Varma )కు ఫైబర్ నెట్ నుండి అక్రమంగా డబ్బులు చెల్లించారని, డబ్బులు తిరిగి చెల్లించాలని 15 రోజుల సమయం ఇచ్చినట్లు తెలిపారు. ఒకవేళ డబ్బులు చెల్లించకుంటే ఆర్జీవి పై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు జీవి రెడ్డి స్పష్టం చేశారు.

You may also like
నా కుమారుడు చనిపోయాడు.. నటి త్రిష ఎమోషనల్
రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు..ప్రకటించిన అల్లు అరవింద్
కజకిస్థాన్ లో కుప్పకూలిన విమానం..భారీగా మృతుల సంఖ్య
ఛాంపియన్స్ ట్రోఫీ..పాక్ తో భారత్ ఢీ ఎప్పుడంటే !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions