Bandi Sanjay Comments On CM Revanth Reddy Over Allu Arjun Issue | తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు కేంద్ర సహాయమంత్రి, బీజేపీ నాయకులు బండి సంజయ్ ( Bandi Sanjay ).
సంధ్య థియేటర్ ( Sandhya Theater ) ఘటనలో రేవతి మృతి అందరూ ఖండించారని, శ్రీతేజ్ కోలుకోవాలని అందరూ కోరుకున్నట్లు బండి చెప్పారు. సమస్య ముగిశాక మళ్లీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో సినిమా కథ అల్లి సమస్యను సృష్టించారని మండిపడ్డారు.
ప్లాన్ ప్రకారం సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అల్లు అర్జున్ ( Allu Arjun ) వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం మాట్లాడారని ఫైర్ అయ్యారు. ఎంఐఎం ఎమ్మెల్యేతో ప్రశ్న అడిగించుకుని సమస్యను పెద్దది చేశారన్నారు.
బీఆరెస్ ( BRS ) ను నిండా ముంచిన ఎంఐఎం ( MIM )తో కలిస్తే కాంగ్రెస్ కూడా నిండా మునుగుతుందన్నారు. ఫుడ్ పాయిజన్ వల్ల గురుకులాల్లో విద్యార్థులు మరణిస్తే వారిని సీఎం ఏనాడైనా పరామర్శించారా అని బండి సంజయ్ నిలదీశారు.
మరణాలకు సీఎం బాధ్యత వహించారా మీకు న్యాయం ఇతరులకు మరో న్యాయమా ? అంటూ ధ్వజమెత్తారు.