Manchu Manoj Political Entry | ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు (Mohan Babu) కుటుంబం కొన్ని రోజులుగా ఫ్యామిలీ గొడవలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా మంచు ఫ్యామిలీ (Manchu Family) కి సంబంధించి ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj), ఆయన భార్య మౌనిక (Bhuma Mounika) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. వారిద్దరూ జనసేన (Janasena) పార్టీలో వారు చేరుబోతున్నారనే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
నంద్యాల (Nandyala) నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం అయితే ఈ ప్రచారంపై మనోజ్ కానీ, మౌనిక కానీ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉండగా సోమవారం మనోజ్ మౌనిక దంపతులు ఆళ్లగడ్డ చేరుకొని భూమా ఘాట్ లో భూమా శోభ, నాగిరెడ్డి లకు నివాళి అర్పించారు.