Sunday 6th July 2025
12:07:03 PM
Home > తాజా > అల్లు అర్జున్ అరెస్ట్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

అల్లు అర్జున్ అరెస్ట్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR On Allu Arjun Arrest | పుష్ప-2 ( Pushpa-2 The Rule ) బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన విషయం తెల్సిందే.

ఈ కేసుకు సంబంధించి శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

అల్లు అర్జున్ అరెస్ట్ ను ఆయన ఖండించారు. జరిగిన ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్‌ను నేరస్తుడిగా ట్రీట్ చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. నేషనల్ అవార్డు విన్నర్ అయిన అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం పాలకుల అభద్రతాభావాన్ని తెలియజేస్తుందన్నారు.

హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకి బాధ్యుడైన రేవంత్ రెడ్డిని కూడా ఇదే లాజిక్‌తో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ⁠ఘటనల్లో గాయపడిన వారికి న్యాయం జరగాలి కాని ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు.

You may also like
సిగాచీ ప్రమాదం..జన్మదిన వేడుకలకు జగ్గారెడ్డి దూరం
‘హిందీ రుద్దలేరు..20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ఠాక్రే సోదరులు’
‘ఫిష్ వెంకట్ కు ప్రభాస్ సహాయం..అందులో నిజం లేదు’
ఇద్దరు కుమారులతో పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions