Monday 6th January 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మంత్రివర్గంలోకి మెగాబ్రదర్

మంత్రివర్గంలోకి మెగాబ్రదర్

Nagababu Set To Join Andhra Pradesh Cabinet | ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

జనసేన ప్రధాన కార్యదర్శి, మెగా బ్రదర్ ( Mega Brother ) నాగబాబు ( Nagababu ) ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. దింతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాగబాబు ను క్యాబినెట్ ( Cabinet ) లోకి తీసుకోవాలని నిర్ణయించారు.

తొలుత నాగబాబు రాజ్యసభ కు వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ ఖాళీ అయిన మూడు స్థానాలకు టీడీపీ నుండి బీద మస్తాన్ రావు, సతీష్ బాబు బీజేపీ నుండి ఆర్. కృష్ణయ్య ( R Krishnaiah ) పేర్లు ఖరారు అయ్యాయి.

ఈ నేపథ్యంలో నాగబాబు ను మంత్రివర్గంలోకి తీసుకొనున్నారు. కాగా మంత్రివర్గంలోకి తీసుకున్నాక ఎమ్మెల్సీని చేస్తారా లేదా ఎమ్మెల్సీ చేశాక మంత్రిని చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

You may also like
‘ఆస్ట్రేలియాలో సునిల్ గావస్కర్ కు అవమానం’
పెళ్లికాని జంటలకు షాకిచ్చిన OYO
త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ వ్యాఖ్యలు..స్పందించిన ‘మా’
గేమ్ ఛేంజర్..బాబాయ్ కి అబ్బాయి థాంక్స్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions