Minister Surekha Buys Slippers For Child Who Walking Without Slippers On Road | పెద్దపల్లి పర్యటన కోసం మంత్రి కొండా సురేఖ వరంగల్ నుండి కాన్వాయ్ లో బయలుదేరారు.
ఈ క్రమంలో సుల్తానాబాద్ మార్కెట్ చౌరస్తా రోడ్డుపై ఓ చిన్నారి చెప్పులు లేకుండా వెళ్తోంది. ఇది గమనించిన మంత్రి తన కాన్వాయ్ ను ఆపి చిన్నారి వద్దకు వెళ్లారు. తాము పనికోసం బీహార్ నుండి వచ్చినట్లు ఆ చిన్నారి తండ్రి మంత్రికి చెప్పారు.
ఈ క్రమంలో వారి ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకున్న మంత్రి, చిన్నారిని తీసుకొని స్వయంగా చెప్పుల దుకాణం వద్దకు వెళ్లారు. చిన్నారికి చెప్పులు మరియు కొత్త బట్టలను కొనిచ్చారు. ఈ క్రమంలో మంత్రికి చిన్నారి తండ్రి ధన్యవాదాలు తెలిపారు.
పసిపాప పెదవులపై చిరునవ్వు చూడగానే తనకు ఎంతో సంతోషంగా ఉందని మంత్రి సురేఖ ఆనందం వ్యక్తం చేశారు.