Women carry snakes | శంషాబాద్ విమానాశ్రయంలో పాములు తరలిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు మహిళల వద్ద పాములు ఉన్నట్లు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు గుర్తించారు. దీంతో విషపూరితమైన పాములను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పాములను తరలిస్తున్న మహిళలను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.









